వార్తలకు తిరిగి వెళ్లండి
సిరికొండ మండలంలోని చిన్నవాల్గోట్ గ్రామంలో వినాయకుడి ఆగమనం వినూత్నంగా జరిగింది. రామసేన కమిటీ సభ్యులు కార్లతో జై శ్రీరామ్, జై రామ్ నినాదాలు చేస్తూ వినాయకుడిని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువచ్చారు.
డప్పుల సప్పుళ్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు మంగళహారతులు పట్టుకుని స్వాగతం పలికారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించి వినాయకుడిని మండపానికి తీసుకువచ్చి ప్రతిష్ఠాపించారు.
Comments
Loading comments...

