వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూరు మండల కేంద్రంలో శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి గణేష్ ఆగమన్ వేడుకను ఘనంగా నిర్వహించారు. సిద్ధిపేట నుంచి నాలుగు కార్ల ముందు ఊరేగింపుగా ట్రాక్టర్‌పై గణనాథుడిని నంగునూరుకు తీసుకొచ్చారు.
డప్పుచప్పుళ్లు, రంగురంగుల లైట్లు, బాణసంచా, డీజే సంగీతంతో యువకుల నృత్యాల మధ్య వేడుక సాగింది. ఏటా మండలంలో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

