Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు!

Follow Udayam on Google
Myadari vamshi vardhan Aug 04, 2026 9:26 AM రాజన్న సిరిసిల్లGeneral
కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు! - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ను ఎస్పీ మహేశ్ బి.గీతే సస్పెండ్ చేశారు. సిద్దిపేట జిల్లా శివారులో ఓ మహిళతో చనువుగా ఉన్న వీడియో ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రవర్తనను సహించబోమని, క్రమశిక్షణ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...