వార్తలకు తిరిగి వెళ్లండి

గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకటరమణ మృతి చెందగా, పలువురు సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే. వెంకట రమణ స్వగ్రామం గుర్ల(M) భుపాలపురం.
అతడికి భార్య, ఇద్దరు కుమారులు (బీటెక్) ఉన్నారు. వెంకటరమణ 2002లో APSP కానిస్టేబుల్గా కొలువు సాధించి, 2012లో సివిల్ కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. ఆసుప్రతి వద్ద భార్య రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. నేడు అంత్యక్రియలు జరగనున్నాయి.
Comments
Loading comments...

