Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం

Follow Udayam on Google
Saychi Kumar Sep 25, 2026 10:01 AM కామరెడ్డితెలంగాణ
కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం - Udayam
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో గత కొన్నాళ్లుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. గురువారం రాత్రి వజ్రఖండి, బంగారుపల్లి శివారుల్లో చిరుత సంచరిస్తోందని రైతులు, ప్రజలు భయాందోళన చెంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. బీట్ అధికారి రాములు బస్వాపూర్ రిజర్వ్ ఫారెస్టులో చిరుత పాదముద్రలను కొలత తీసుకొని పరిశీలించారు. 8 చోట్ల ఉన్న పాదముద్రలు చిరుతయేనని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...