Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాల్వలో నీటి కోసం రైతుల నిరసన

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 03, 2026 6:02 PM నాగర్ కర్నూల్General
కాల్వలో నీటి కోసం రైతుల నిరసన - Udayam
ఉప్పునుంతల మండలం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌ డీ-17 కాల్వకు నీరు రాకపోవడంతో పెద్దాపురం, లక్ష్మాపురం, మామిళ్లపల్లి గ్రామాల రైతులు కాల్వలో గురువారం నిరసన తెలిపారు. కాల్వలో మట్టి, బండరాళ్లు పేరుకుపోవడంతో నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 800 ఎకరాల పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. రైతులకు బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...