Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువలో జారిపడి విద్యార్థి గల్లంతు

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:20 PM పశ్చిమగోదావరి General
కాలువలో జారిపడి విద్యార్థి గల్లంతు - Udayam
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలంలో కాలువలో జారిపడి పదో తరగతి విద్యార్థి గల్లంతయ్యాడు. అయినపర్రుకు చెందిన కర్రీ మోహన్‌రెడ్డి(15) శుక్రవారం స్నేహితులతో వాకింగ్‌కు వెళ్లాడు. రాపాక కాలువ వద్ద కాలకృత్యాలు తీర్చుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో జారిపడ్డాడు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది గాలింపు చేపట్టారు.

Comments

G
Loading comments...