వార్తలకు తిరిగి వెళ్లండి

కోసిగి 7వ వార్డు కాలనీలో పారిశుద్ధ్యం లోపించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త పేరుకుపోయి మురుగు నీరు రోడ్డుపైకి చేరుతోంది. దుర్వాసనతో పాటు దోమలు, పందుల సంచారం పెరిగింది.
అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేయించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

