వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో టూటౌన్ ఫ్లైఓవర్ శిథిల సిమెంట్ రైలింగ్ వల్ల తీవ్ర ప్రమాదం పొంచి ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత నాలుగేళ్లుగా అధికారులు పట్టించుకోకపోవడంతో పెచ్చులు ఊడిపడుతున్నాయని, పలుచోట్ల రైలింగ్ పూర్తిగా విరిగిపోయిందని వాపోయారు. పాదచారులు ఏమాత్రం తూలినా కిందనున్న సర్వీస్ రోడ్డుపై పడిపోయే ప్రమాదముందని, అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

