వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో గురువారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఎన్ఎం శ్యామల ఆధ్వర్యంలో గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ జ్యోతి సందర్శించి వైద్య సిబ్బందిని అభినందించారు. గ్రామస్తులందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Comments
Loading comments...

