Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూలపల్లి మండలంలో పిడుగుపాటు.. మహిళ మృతి

Follow Udayam on Google
S. Kumar Sep 23, 2026 5:47 PM పెద్దపల్లితెలంగాణ
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం బాలరాజుపల్లి వద్ద బుధవారం పిడుగుపడి ధర్మారం మండలం శ్రావణపల్లికి చెందిన మారం అంజమ్మ (మహిళ కూలీ) అక్కడికక్కడే మృతి చెందారు. కొత్తూరుకు చెందిన లక్ష్మికి గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. కూలి పనుల కోసం వచ్చిన తమవారిని మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...