వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రోటోకాల్ ఏఈఓ లోకేశ్ బాబు పర్యవేక్షణలో జస్టిస్ అమిత్ శర్మ స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్ వెంకటస్వామి, కోర్టు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

