Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉధృతమైన జూనియర్‌ వైద్యుల సమ్మె

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 7:37 AM అమరావతిGeneral
ఉధృతమైన జూనియర్‌ వైద్యుల సమ్మె - Udayam
స్టైపెండ్‌ పెంపు, ఇతర డిమాండ్ల పరిష్కారం కోరుతూ జూనియర్‌ డాక్టర్లు సమ్మెను ఉధృతం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల వద్ద చేతులు బంధించుకుని, నోటికి ప్లాస్టర్లు వేసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. అత్యవసర సేవలను బహిష్కరించడంతో ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖలో నిరసనలు, తిరుపతిలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

Comments

G
Loading comments...