వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని హింగోలి, నాందేడ్ జిల్లాల్లో శనివారం ఉదయం స్వల్ప భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి. ఉదయం 7:46 గంటలకు ఔంధా నాగ్‌నాథ్ తాలూకాలోని గధాలా ప్రాంతంలో 3.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు హింగోలి జిల్లా విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
హఠాత్తు ప్రకంపనలతో స్థానికులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే తీవ్రత తక్కువగా ఉండటంతో ఇప్పటివరకు భారీ నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

