Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో 20న జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలు

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 4:52 PM ఆదిలాబాద్తెలంగాణ
ఆదిలాబాద్‌లో 20న జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలు - Udayam
ఆదిలాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ జూనియర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలను ఈ నెల 20న నిర్వహించనున్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని సెక్రటరీ రాజేశ్ కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు. పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...