వార్తలకు తిరిగి వెళ్లండి

పూసపాటిరేగలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై వార్త రాసిన విశాలాంద్ర విలేకరి గోవింద్'పై దాడి చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని బొబ్బిలి జర్నలిస్టుల ఐక్యవేదిక నాయకులు కందుల వాసు, ప్రజా సంఘాలు, వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు.
ఈ దాడికి నిరసనగా బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణపై వార్త రాస్తే దాడులు చేయడం అన్యాయమని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

