Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ స్వీపర్ల ఆందోళన

Follow Udayam on Google
G. Sathish Sep 29, 2026 2:21 PM హైదరాబాద్General
తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద స్వీపర్లు ఆందోళన చేపట్టారు. 20 నెలలుగా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయానికి వచ్చినా, ప్రజాభవన్‌కు వెళ్లినా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు. జీతాలు లేక కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 వేల మంది స్వీపర్లు, స్కావెంజర్లకు 20 నెలలుగా జీతాలు చెల్లించలేదని ఆరోపించారు.

Comments

G
Loading comments...