Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌పై భారత్‌ ఘన విజయం

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 12:07 PM జాతీయంక్రీడలు
జపాన్‌పై భారత్‌ ఘన విజయం - Udayam
ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో జపాన్‌పై 49-24తో ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ తొలి అర్ధభాగం ముగిసేసరికి 31-9తో భారీ ఆధిక్యంలో నిలిచింది. ఆషు మూడు పాయింట్ల రైడ్‌తో ఆకట్టుకోగా.. దేవాంక్‌, పవన్‌ సెహ్రావత్‌, అర్జున్‌ దేశ్‌వాల్‌, అస్లాం ఇనామ్‌దార్‌ దాడిలో కీలకంగా నిలిచారు. సునీల్‌ కుమార్‌, రాహుల్‌ రక్షణలో రాణించారు.

Comments

G
Loading comments...