Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంపరకోట- మేనకోట రహదారిపై కొండచరియలు

Follow Udayam on Google
Ganga Sep 25, 2026 12:55 PM పార్వతీపురం మన్యంGeneral
జంపరకోట- మేనకోట రహదారిపై కొండచరియలు - Udayam
పాలకొండ (M) జంపరకోట-మేనకోట వెళ్లే ప్రధాన రహదారిపై తుఫాన్ ప్రభావంతో కొండచరియలు విరిగిపడి రోడ్డుపై పడిపోయాయి. దీంతో రహదారిపై మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో ఇరువైపులా రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు ప్రమాద భయంతో నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి రోడ్డుపై పడిన రాళ్లు మట్టిని తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని కోరారు.

Comments

G
Loading comments...