Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది

Follow Udayam on Google
p.g.murthy Aug 18, 2026 8:43 AM మంచిర్యాలGeneral
జన్నారంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది - Udayam
జన్నారం మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చలేక పోతోంది. శనివారం రాత్రి దాదాపు 6 గంటలకు పైగా జన్నారం పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి అయినా విద్యుత్ రాకపోవడంతో ప్రజలు అంధకారంలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు విద్యుత్ సరఫరాను పర్యవేక్షించాల్సిన ఏఈ పోస్టు ఖాళీగా ఉంది. సరిపడా సిబ్బంది కూడా లేకపోవడంతో విద్యుత్ సరఫరా గాలిలో పెట్టిన దీపంలా మారింది.

Comments

G
Loading comments...