వార్తలకు తిరిగి వెళ్లండి
జన్నారం మండలంలో బంద్ స్వచ్ఛందంగా ప్రారంభమైంది. టైగర్ జోన్ ను ఎత్తివేయాలని కోరుతూ సామాజిక పోరాట సమితి కన్వీనర్ భూమాచారి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఉదయం జన్నారం బస్టాండ్ సమీపంలోని హోటళ్లను వ్యాపారులు మూసివేశారు.
అలాగే కిరాణం, తదితర దుకాణాలను కూడా వ్యాపారులు తెరవలేదు. అంగడి బజార్, ధర్మారం చౌరస్తా, కవ్వాల్ చౌరస్తా ప్రాంతాలలో దుకాణాలు మూతపడ్డాయి. విద్యా సంస్థలకు బందు నుండి మినహాయింపు ఇచ్చారు.
Comments
Loading comments...

