వార్తలకు తిరిగి వెళ్లండి

దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న జంఝావతి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీ నుంచి చేపట్టనున్న సాధన దీక్షలను విజయవంతం చేయాలని జంఝావతి సాధన సమితి సభ్యులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పార్వతీపురంలో సాధన దీక్షలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆయకట్టు రైతులు, యువత, ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని దీక్షలను విజయవంతం చేయాలని ప్రచార కమిటీ కన్వీనర్ వారణాసి శ్రీహరి కోరారు.
Comments
Loading comments...

