Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంగారెడ్డిగూడెంలో అటవీ అమరవీరుల దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:10 PM ఏలూరుGeneral
జంగారెడ్డిగూడెంలో అటవీ అమరవీరుల దినోత్సవం - Udayam
జంగారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. అటవీ శాఖ కార్యాలయం నుంచి అధికారులు, సిబ్బంది ర్యాలీ చేపట్టారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అటవీ అమరవీరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దుర్గ కుమార్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...