Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనావాసాల మధ్య సెల్ టవర్ వద్దంటూ నిరసన

Follow Udayam on Google
Ganga Oct 02, 2026 1:47 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురం పట్టణ కేంద్రం బెలగాంలోని బీజీఎన్, బీపీఎన్ అపార్ట్మెంట్ల సమీపంలో సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అపార్ట్మెంట్ యజమానులు నిరసన చేపట్టారు. టవర్ నిర్మాణానికి మంజూరు చేసిన అనుమతులను రద్దు చేయాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారి హేమలతకు వినతిపత్రం అందజేశారు. జనావాసాలకు సమీపంలో టవర్ నిర్మాణంతో ప్రజల్లో ఆందోళన నెలకొందని అసోసియేషన్ అధ్యక్షుడు చింతల లక్ష్మణరావు తెలిపారు.

Comments

G
Loading comments...