వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల మండలం జమ్ములపాలెంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రహదారులకు ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ శంకుస్థాపన చేశారు. పల్లె పండగ 3.0లో భాగంగా రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
రహదారుల నిర్మాణంతో గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు పంటలను సులభంగా ఇళ్లకు తరలించుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

