Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఆరు విలేజ్ క్లినిక్ లు ప్రారంభం

Follow Udayam on Google
S.Satyanarayana Patnaik Oct 06, 2026 6:19 PM విజయనగరంGeneral
జిల్లాలో ఆరు విలేజ్ క్లినిక్ లు ప్రారంభం - Udayam
విజయనగరం జిల్లాలో ఆరు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ మంగళవారం వర్చువల్ గా ప్రారంభించారు. రూ.149.70 లక్షలతో నిర్మించిన క్లినికల్ లు జగన్నాథపురం, పల్లి గండ్రేడు, కొండసంభం, ఏనుగువలస, అంబటివలస, సారిపల్లి గ్రామాల్లో ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు 105 రకాల మందులు, 14 రకాల ప్రాథమిక వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి.

Comments

G
Loading comments...