Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా సాఫ్ట్‌బాల్‌ జట్టుకు లోకేశ్‌ ఎంపిక

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:48 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
జిల్లా సాఫ్ట్‌బాల్‌ జట్టుకు లోకేశ్‌ ఎంపిక - Udayam
అగళి మండలం మధూడి జడ్పీ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి ఎన్.లోకేశ్‌ అనంతపురం జిల్లా అండర్‌-17 జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ జట్టుకు ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన అతడిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు హెచ్‌ఎం ప్రభురాజ్, వ్యాయామ ఉపాధ్యాయుడు శివకుమార్ తెలిపారు. కడప జిల్లా పుల్లంపేటలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో జిల్లాస్థాయి పోటీలు జరగనున్నట్లు వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...