వార్తలకు తిరిగి వెళ్లండి

జీలుగుమిల్లి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దర్భగూడెం పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం ఎస్టీ కాలనీ సహా పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వరద నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి నీటిని తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

