Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగనన్న కాలనీలో అధ్వానంగా పారిశుద్ధ్యం

Follow Udayam on Google
B RAJESH Aug 31, 2026 4:54 PM విజయనగరంGeneral
జగనన్న కాలనీలో అధ్వానంగా పారిశుద్ధ్యం - Udayam
బొబ్బిలి మున్సిపాలిటీలోని ఐటీఐ కాలనీ పక్కనున్న జగనన్న కాలనీలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ఇంటింటి నుంచి సక్రంగా చెత్త సేకరణ జరగకపోవడంతో కాలనీ ప్రజలు ఖాళీ స్థలాలలో చెత్త వేస్తున్నారు. వాటర్ ట్యాంక్ పక్కనే చెత్త వేయడంతో అపారిశుద్ధ్యం పెరిగిపోతుంది. దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీ స్థలాలలో చెత్త వేయకుండా ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...