Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో ఘనంగా వేంకటేశ్వర స్వామి కళ్యాణం

Follow Udayam on Google
Devender Bale Aug 28, 2026 11:05 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో ఘనంగా వేంకటేశ్వర స్వామి కళ్యాణం - Udayam
జగిత్యాల 9వ వార్డు శాంతినగర్లో శుక్రవారం జంధ్యాల పౌర్ణమి సందర్భంగా సాయంత్రం వేంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగన్నాధం చక్రపాణి ఆచార్య (భరద్వాజస) ఆధ్వర్యంలో అలివేలు మంగ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణం వేద పండితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రతి నెలా పౌర్ణమి రోజు కళ్యాణం నిర్వహిస్తున్న కమిటీ నిర్వాహకులను వార్డు ప్రజలు అభినందించారు. భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...