Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల శ్రీసూర్య ధన్వంతరి దేవాలయంలో ఘనంగా పూజలు

Follow Udayam on Google
Devender Bale Sep 18, 2026 3:44 PM జగిత్యాలGeneral
జగిత్యాల  శ్రీసూర్య ధన్వంతరి దేవాలయంలో ఘనంగా పూజలు - Udayam
జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు సమీపంలో ఉన్న శ్రీసూర్య ధన్వంతరి ధనలక్ష్మి సహిత దేవాలయంలో భాద్రపద మాసం శుక్రవారం సందర్భంగా మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి, అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు. కుంకుమ పూజ అనంతరం లక్కీ డిప్ ద్వారా ఒకరిని ఎంపిక చేసి అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం, తాంబూలాన్ని పూజారి శ్రీహరి ఆశీర్వచనాలతో అందజేశారు.

Comments

G
Loading comments...