Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలో CEIRతో 102 మొబైల్ ఫోన్ల రికవరీ

Follow Udayam on Google
Devender Bale Aug 19, 2026 7:28 PM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లాలో CEIRతో 102 మొబైల్ ఫోన్ల రికవరీ - Udayam
జగిత్యాల జిల్లాలో పోయిన, చోరీకి గురైన 102 మొబైల్ ఫోన్లను CEIR సాంకేతికత ద్వారా పోలీసులు రికవరీ చేసి బాధితులకు బుధవారం అప్పగించారు. వీటి విలువ సుమారు రూ.21 లక్షలు ఉంటుందన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, మొబైల్ పోయిన వెంటనే www.ceir.gov.in లో⁠ వివరాలు నమోదు చేయాలని సూచించారు. CEIR ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో 2,024 ఫోన్లు, సుమారు రూ.4.5 కోట్ల విలువైన మొబైళ్లను రికవరీ చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...