Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాకు తేలికపాటి వర్ష సూచన

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 9:32 AM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లాకు తేలికపాటి వర్ష సూచన - Udayam
జగిత్యాల జిల్లాలో రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి. శ్రీలక్ష్మి తెలిపారు. అక్టోబర్ 19 నుంచి 21 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడవచ్చన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 33–34 డిగ్రీలు, రాత్రి 23–24 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. వాయువ్య దిశ నుంచి గంటకు 1–3 కి.మీ. వేగంతో గాలులు వీచవచ్చన్నారు.

Comments

G
Loading comments...