వార్తలకు తిరిగి వెళ్లండి

దత్తిరాజేరు మండలం కోమటిపల్లి కూడలి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.రోడ్డు దాటుతున్న లారీ క్లీనర్ దమ్ము చిన్నోడు (55)ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు.బస్సు రామభద్రపురం నుంచి విజయనగరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మృతుడు ఎల్.కోట మండలం పోతంపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కళాధర్ తెలిపారు
Comments
Loading comments...

