Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల చెట్టుకు వస్త్రం విదేశాలకు అస్త్రం

Follow Udayam on Google
Vamshi Vardhan Sep 16, 2026 4:42 PM జగిత్యాలGeneral
జగిత్యాల  చెట్టుకు వస్త్రం  విదేశాలకు అస్త్రం - Udayam
జగిత్యాల అర్బన్‌ మండలం హాస్నాబాద్‌ యువత వినాయక నవరాత్రుల సందర్భంగా పదేళ్లుగా ప్రత్యేక సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ముగింపు రోజున మండపం సమీపంలోని చెట్టుకు పూజల్లో ఉపయోగించిన వస్త్రాన్ని కడతారు. వస్త్రం కట్టిన యువకులు విదేశాలకు వెళ్తారనే నమ్మకం గ్రామంలో ఉంది ఈ ఆచారాన్ని పాటించిన పలువురు అమెరికా, లండన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. యువతలో సంప్రదాయంపై ఆసక్తి పెరుగుతోంది.

Comments

G
Loading comments...