Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేఎన్‌టీయూహెచ్‌లో 1,062 ఇంజినీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నాయి

Follow Udayam on Google
S kumar Aug 18, 2026 5:12 PM పెద్దపల్లిGeneral
జేఎన్‌టీయూహెచ్‌లో 1,062 ఇంజినీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నాయి - Udayam
హైదరాబాద్: జేఎన్‌టీయూహెచ్‌ (JNTUH) అనుబంధ కళాశాలల్లో మొత్తం 1,062 ఇంజినీరింగ్ సీట్లు ఖాళీగా మిగిలిపోయినట్లు అడ్మిషన్ల డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు. యూనివర్సిటీ ప్రధాన ప్రాంగణంలో 26 సీట్లు ఉండగా... జగిత్యాల, మంథని, పాలేరు, సిరిసిల్ల, వనపర్తి, సుల్తాన్‌పూర్, మహబూబాబాద్‌ కళాశాలల్లోనూ సీట్లు మిగిలాయన్నారు. అత్యధికంగా కోస్గి కళాశాలలో 150 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...