Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామేపల్లిలో భూ రీ-సర్వేను పరిశీలించిన జేసీ

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 4:43 PM ప్రకాశం General
కామేపల్లిలో భూ రీ-సర్వేను పరిశీలించిన జేసీ - Udayam
జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్డీఓ బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం MRO కార్యాలయాన్ని సందర్శించి VROలతో రెవెన్యూ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను, పెండింగ్ సమస్యలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...