వార్తలకు తిరిగి వెళ్లండి

జాషువా కవిత్వం తెలుగు నేల నుంచి విశ్వమానవత వైపు సాగిన గొంతుక అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాషువా చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. జాషువా రచనలు స్ఫూర్తిదాయకమని అన్నారు.
Comments
Loading comments...

