వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. గుంతలు రోజురోజుకూ పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
ఈ మార్గంలో నిత్యం వందలాది బస్సులు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదాల ముప్పు ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సీసీ రోడ్డు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

