Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైపూర్ పవర్ ప్లాంట్ నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలి

Follow Udayam on Google
Chitty Ramesh Sep 24, 2026 5:39 PM మంచిర్యాలGeneral
జైపూర్ పవర్ ప్లాంట్ నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలి - Udayam
జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను గురువారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సందర్శించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సుమన్ అన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు.

Comments

G
Loading comments...