Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయపట్నం పోర్టు అమ్మకంపై జగన్ ఆగ్రహం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 20, 2026 6:42 AM అమరావతిGeneral
రామాయపట్నం పోర్టు అమ్మకంపై జగన్ ఆగ్రహం - Udayam
రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.4,929 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన పోర్టును కేవలం రూ.1,500 కోట్లకే ప్రైవేటు వ్యక్తులకు ఎలా అమ్ముతారని ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని విమర్శించారు. ఇదెక్కడి ఆర్థిక విధానమంటూ సీఎం చంద్రబాబు నాయుడును ఆయన నిలదీశారు.

Comments

G
Loading comments...