వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి కోసం జాంబియాకు వెళ్లిన నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన జనపాల లింగస్వామి(50) ప్రమాదంలో మృతి చెందారు.
బోర్ డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లింగస్వామి కొన్నేళ్లుగా జాంబియాలో బోరింగ్ రిగ్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. ఆయన మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

