Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జామిలో 230 మందికి టీబీ పరిక్షలు

Follow Udayam on Google
B RAJESH Aug 19, 2026 9:49 PM విజయనగరంGeneral
జామిలో 230 మందికి టీబీ పరిక్షలు - Udayam
జామి పీహెచ్సీ పరిధిలో వంద రోజుల టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా జామి గ్రామంలో 230 మందికి ఛాతీ ఎక్స్రేలు తీశారు. వైద్యాధికారులు సామ్రాజ్యలక్ష్మి, శ్వేత పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు. టీబీ సూపర్వైజర్లు బి.జి.శ్రీనివాసరావు, రాము, చిట్టిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పీహెచ్సీ సిబ్బంది ప్రజలకు సేవలందించారు.

Comments

G
Loading comments...