Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాకీలతో ఆలయాన్ని పైకి లేపుతున్న గ్రామస్థులు

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:20 PM సూర్యాపేటGeneral
జాకీలతో ఆలయాన్ని పైకి లేపుతున్న గ్రామస్థులు - Udayam
కోదాడ–మేళ్లచెరువు ప్రధాన రహదారి ఎత్తు పెరగడంతో గుడిబండలోని సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని 60 జాకీల సాయంతో పైకి లేపుతున్నారు. కొత్తగా ఆలయం నిర్మించడం ఖర్చుతో కూడుకోవడంతో గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రెండు అడుగులు పైకి లేపగా, మరో మూడు అడుగుల ఎత్తుకు చేర్చేందుకు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు నేడు కూడా కొనసాగనున్నాయి.

Comments

G
Loading comments...