Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుక ట్రాక్టర్‌ ప్రమాదంలో కూలీకి గాయాలు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 11:40 AM పెద్దపల్లి General
ఇసుక ట్రాక్టర్‌ ప్రమాదంలో కూలీకి గాయాలు - Udayam
గోదావరిఖని శివారులోని గోదావరి నదిలో ఇసుక ట్రాక్టర్‌ ప్రమాదంలో కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. ఇందిరానగర్‌కు చెందిన మల్లేశ్‌ సోమవారం ట్రాక్టర్‌లో ఇసుక నింపేందుకు వెళ్లాడు. ఇసుక నింపిన అనంతరం డ్రైవర్‌ గమనించకుండా ట్రాక్టర్‌ను రివర్స్‌ చేయడంతో కూలీ కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...