Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటిలోని వ్యర్థాలను ఇచ్చి బహుమతులు పొందాలి - MPDO

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 25, 2026 4:54 PM విజయనగరంGeneral
ఇంటిలోని వ్యర్థాలను ఇచ్చి బహుమతులు పొందాలి - MPDO - Udayam
ప్రజలు తమ ఇంటిలోని వ్యర్థాలను అందించి బహుమతులు పొందాలని బొండపల్లి MPDO రఘుపతిరావు సూచించారు. దసరా మహోత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం రాచకిండాం గ్రామంలో ప్రజలకు నిత్యవసర సరుకులతో పాటు బహుమతులను అందజేశారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ మైలవరపు కృష్ణ తేజ సూచనల మేరకు స్వచ్చరథం ప్రతి గ్రామంలో తిరుగుతున్నట్లు తెలిపారు. వ్యర్థాలకు నిత్యవసర సరుకులతో పాటు ప్రత్యేక‌ బహుమతులు కూడా అందిస్తారని తెలిపారు.

Comments

G
Loading comments...