వార్తలకు తిరిగి వెళ్లండి

ముమ్మిడివరం కాశీవారితూము సమీపంలో భారీ వాహనం 11 కేవీ విద్యుత్ వైర్లను తెంపడంతో ఇంటికి విద్యుత్ ప్రవహించింది. తెగిన వైర్ల నుంచి సర్వీస్ కనెక్షన్‌కు కరెంట్ చేరడంతో ఇంటి వైరింగ్ కాలిపోయి దంపతులకు విద్యుత్ షాక్ తగిలింది.
భయాందోళనకు గురైన దంపతులు వెంటనే ఇంటి నుంచి బయటకు రావడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
Comments
Loading comments...

