వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లాలోని 8 బస్తీ దవాఖానాల్లో కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల నియామకానికి ఈ నెల 17న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ హైమావతి తెలిపారు.
ఎంబీబీఎస్ సర్టిఫికెట్, తెలంగాణ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఉన్న అర్హులు ఉదయం 11 గంటలకు ఐడీఓసీలో ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...

