వార్తలకు తిరిగి వెళ్లండి
ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ నిలపాలని ప్రయాణికుల డిమాండ్

హైదరాబాద్ - విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12796) రైలుకు మిర్యాలగూడలో హాల్టింగ్ లేకపోవడంతో ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వారికి ఈ రైలు ఎంతో కీలకం.
ఉద్యోగ, వ్యాపార అవసరాల నిమిత్తం గుంటూరు, విజయవాడ వెళ్లేవారి సౌకర్యార్థం మిర్యాలగూడ స్టేషన్‌లో రైలు నిలిపేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...