వార్తలకు తిరిగి వెళ్లండి

మ్యాగీ నూడుల్స్‌లో పురుగులున్నాయన్న సోషల్ మీడియా ఆరోపణలను నెస్లే ఇండియా ఖండించింది. ఇవి నిరాధారమైనవని, నాణ్యతా పరీక్షల్లో తమ ఉత్పత్తులు సురక్షితమని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు నుండి ఎటువంటి శాంపిల్స్ అందలేదని కంపెనీ పేర్కొంది.
తమ ఉత్పత్తులు కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నెస్లే ధృవీకరించింది. వినియోగదారుల ఆరోగ్యం, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని, ఆరోపణలు అవాస్తవమని స్టాక్ ఎక్స్చేంజీలకు వివరణ ఇచ్చింది.
Comments
Loading comments...

